నంద‌మూరి డైరెక్ట‌ర్‌తో అఖిల్‌..!

480450120478

తొలి సినిమా డిజాస్టర్ గా నిలిచినా యంగ్ హీరో అక్కినేని అఖిల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా ప్లాప్ అయినా అఖిల్ యాక్టింగ్‌, ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల విష‌యంలో మ‌నోడికి మంచి మార్కులే ప‌డ్డాయి. అందుకే అఖిల్ తో రెండోసినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు కూడా సై అంటున్నారు. ఇప్పటికే కొంతమంది దర్శకులు కథ రెడీ చేసే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో ఇప్ప‌టికే ప‌లు పేర్లు కూడా వినిపించాయి.
తొలి సినిమా రిజల్ట్ తో రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్. ఎలాంటి కథను ఎంచుకోవాలో ఇంతవరకు ఫైనల్ చేయకపోయినా అఖిల్ సినిమా కోసం ఎదురుచూసే దర్శకులు సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది.
త్రివిక్రమ్, విక్రమ్ కె కుమార్, శ్రీనువైట్ల, వంశీ పైడిపల్లి లాంటి టాప్ మేకర్స్ పేర్లు ఇప్పటికే క్యూలో ఉండగా తాజాగా మరో స్టార్ డైరెక్టర్, ఈ లిస్ట్ లో చేరిపోయాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతి బరిలో ఘనవిజయం సాధించిన సుకుమార్, అఖిల్ హీరోగా ఓ ప్రేమకథను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అయితే ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన సుకుమార్.. అఖిల్ సినిమాను ఎప్పుడు మొదలు పెడుతాడన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.
నాన్న‌కు ప్రేమ‌తో సినిమా చూసిన నాగ్ ఆ సినిమా తెర‌కెక్కించిన విధానం ప‌ట్ల ముగ్ధుడై సుకుమార్‌కు ఫోన్ చేసి అభినందించాడ‌ట‌. అఖిల్ కోసం ఓ మంచి ల‌వ్ స్టోరీ ఉంటే రెడీ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఇందుకు సుకుమార్ కూడా ఓకే చెప్పిన‌ట్టు టాక్‌. ఏదేమైనా సుక్కు దేవీతో చేసే సినిమా త‌ర్వాత అఖిల్ సినిమా ప‌ట్టాలెక్కుతుందేమో చూడాలి.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...