మ‌హాత్మ గాంధీ చివ‌రి రోజు ఇలా

89560602

అహింసా మార్గంతో దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహనీయుడు మహాత్మాగాంధీ. జనవరి-30 1948లో గాంధీజీ హత్య జ‌రిగింది. స్వాతంత్ర్యం కోసం ఎన్నో కలలు గన్న గాంధీజీ.. స్వాతంత్ర్యం సిద్ధించిన నాలుగు నెలలకే ప్రాణాలు కోల్పోయారు. భౌతికంగా ‘బాపూజీ’ లోకాన్ని వీడినా.. ఆయన త్యాగనిరతి జాతి జనుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయింది. గాంధీజీ చనిపోయేనాటికి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వి.కళ్యాణం చెప్పిన వివరాల ప్రకారం.. ఒకసారి గాంధీజీ జీవితంలో చివరిరోజుని పరిశీలిస్తే ఆనేక విష‌యాలు మ‌న‌కు తెలుస్తాయి.
గాంధీజీ చివ‌రి రోజున ఏం జ‌రిగిందంటే….
– ప్రతిరోజు గాంధీ దినచర్య ప్రార్థనతోనే మొదలయ్యేది. ప్రార్థనను ఉదయానికొక తాళం చెవిగా.. రాత్రి వేళకు ఒక బోల్టుగా అభివర్ణించేవారు గాంధీ. చనిపోయే రోజు కూడా యథావిధిగా ఉదయం 3 :30 నిమిషాలకు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు గాంధీ.
– ఉదయం 6 గంటలకు జవహర్ లాల్ నెహ్రూ మేనల్లుడైన రతన్ కుమార్ నెహ్రూ భార్య రంజన్ గాంధీజీని కలుసుకుని కాసేపు ముచ్చటించారు.
– 9:30 నిమిషాలకు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యంగ ముసాయిదాను పరిశీలించిన గాంధీ.. అనంతరం భోజనం చేశారు.
– మధ్యాహ్నం సమయంలో లైఫ్ మ్యాగజైన్ ఫొటోగ్రాఫర్ మార్గరెట్ బోర్క్ వైట్ కి గాంధీజీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ లో భారత డిప్యూటీ హై కమిషనర్ గా పనిచేస్తున్న ఎన్.ఆర్.మల్కానితో చర్చలు జరిపారు.
– సాయంత్రం సమయంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ మరియు ఆయన కుమార్తె గాంధీని కలిశారు
– సాయంత్రం 4:30 నిమిషాలకు గాంధీజీ భోజనం చేశారు
– సాయంత్రం 5:15 నిమిషాలకు బిర్లా హౌజ్ లోని ప్రార్థన సమావేశానికి గాంధీజీ మేనకోడళ్లు మను, అబాలతో కలిసి బయల్దేరారు.
– సాయంత్రం 5:17 నిమిషాలకు నాథూరాం గాడ్సే.. తన దగ్గర ఉన్న పిస్టల్ తో గాంధీజీపై కాల్పులు జరిపాడు. గుండెలోకి మూడు బుల్లెట్లు చొచ్చుకుపోవడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు గాంధీ. ఊహించని ఈ పరిణామానికి దేశం నివ్వెరపోయింది. జీవితమంతా స్వాతంత్ర్యం కోసం ఆరాటపడ్డ గాంధీ.. స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరం గడవకముందే ఇలా ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కలచివేసింది.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...