అమెజాన్ మెగా సెల్

81050450212010

ప్ర‌ముఖ ఇ-కామ‌ర్స్ వెబ్‌సైట్ అమొజాన్ మెగా సేల్‌కు శ్రీకారం చుట్టింది. జనవరి 23 వరకూ సాగే ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లు..ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. 72 గంటల డీల్ మారథాన్ పేరుతో ఈ సేల్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతకు సంబంధించిన ఉత్పత్తులు..ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్సే ఈ సేల్ లో ఉండబోతున్నాయి. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డంలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే అమెజాన్ గ‌త ద‌స‌రా, దీపావ‌ళికి కూడా భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. తాజాగా ఈ సంస్థ సేల్స్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. కొన్ని ఉత్పత్తులపై ఎంపిక చేసిన కార్డులపై కొంటే 15 శాతం వరకూ క్యాష్ బ్యాక్ సౌకర్యం కూడా ఉంది.


దీపావ‌ళికి ‘గ్రేట్‌ ఇండియన్‌ దీవాలి సేల్‌’ పేరుతో 72 గంటల పాటు ప్ర‌త్యేక షాపింగ్ హంగామా చేసింది. ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి 30 నిమిషాల‌కు ఓ స‌రికొత్త డీల్‌తో అమెజాన్ వినియోగ‌దారుల‌కు దిమ్మ తిరిగే ఆఫ‌ర్లు ఇచ్చి కోట్ల రూపాయ‌ల వ్యాపారం చేసింది. ఇక తాజాగా అమెజాన్ మ‌ర‌థాన్ డీల్‌లో ఖాతాదారులు తమ పర్సనల్‌ కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు లేదా మొబైల్‌ యాప్స్‌ ద్వారా ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన వచ్చు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...