ఫేస్‌బుక్‌లో బ్రేకప్ ఆప్షన్ !

0850401201


ప్రేమొక్క‌టే మ‌ధురం.. ప్రియురాలు మాత్రం క‌ఠినం..
వీడిపోయే ప్ర‌తి జంట‌కూ ఇదే అనుభ‌వం.. మ‌రిచిపోవ‌డం
క‌న్నా మ‌న‌సుకు లేదు ఏదీ మిన్న‌.. అనుకోవ‌డం ల‌వ‌ర్ వంతు.
కానీ ఆ.. తంతు సాధ్య‌మేనా? సాధ్య‌మే అంటోంది ఫేస్ బుక్ .
ఎలా అంటే..?
భగ్న ప్రేమికులకి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఎన్నో రకాల సమస్యలు . వాటిలో ముఖ్యంగా ప్రేయసిని మర్చిపోవడం. లవ్ బ్రేకప్ అయినప్పటి నుంచి ఇంతకు మునుపు తన మాజీ లవర్ తో గడిపిన సంతోష క్షణాలు, చెప్పిన ఊసులు, తియ్యని కబురులు ఇలా అనేకం గుర్తుకువ‌చ్చి వేధిస్తుంటాయి. మనశ్సాంతి లేకుండా చేస్తుంటాయి. వాటన్నింటిలోకీ ముఖ్యంగా ఫేస్ బుక్ ఓల్డ్ మెమరీస్. మాజీ లవర్ ని మీ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి అన్ ఫ్రెండ్ చేసినా..మునుపు జంటగా ఉన్నప్పుడు ఫేస్ బుక్ వేదికగా సాగించిన చిలిపి సంభాషణలు, కొంటె కలాపాలు, పెట్టిన పోస్టులు, పంచుకున్న స్టేటస్ లు, ఫొటోలు అలాగే ఉండిపోతాయి. విడిపోయాక ఆ.. ఫొటోలను, మెస్సేజ్ లను డిలీట్ చెయ్యడం, అన్ ట్యాగ్ చెయ్యడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంకా చెప్పుకుంటే.. అసాధ్యం కూడా!
జ్ఞాప‌కాల‌ను తుడిచెయ్యండిలా…!
ఒక్కోసారి ఎవరికైనా మెసేజ్ టైప్ చేసేటప్పుడు మాజీ లవర్ పేరు సజెస్ట్ అవ్వడం వంటివి పాత జ్ఞాపకాలను బయటికి తోడి మనసును భాద పెడుతుంటాయి. ఇటువంటి ఇబ్బందుల నుంచి ఉపశ‌మనం కలిగిస్తూ ఫేస్ బుక్ ఓ సరికొత్త టూల్ ను అందివ్వబోతోంది. దీని సాయంతో పాత వ్యక్తుల జ్ఞాపకాలను ఒకేసారి మీ అకౌంట్ నుండి తుడిచేయ్యొచ్చు. ఈ పని చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తికీ నోటిఫికేషన్లు కూడా వెళ్ళవు. నిర్భయంగా పాత జ్ఞాపకాలను ఫేస్ బుక్ నుంచి తొలగించి హాయిగా కొత్త జీవితం ఎంజాయ్ చెయ్యొచ్చు. నిజంగా ఈ టూల్ భగ్న ప్రేమికులకి బాగానే ఉపయోగపడబోతోంది. ఇంకేం ప్రేమికులారా! పాత ప్రేయ‌సిని మ‌రిచిపోడింక సునాయాసంగా.. బ్రేక‌ప్ ఇన్ ఈజీ వే!
please share it..

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...