సీపీఐ నేత పై సన్నీలియోన్ హట్ కామెంట్

సీపీఐ నేత పై సన్నీలియోన్ హట్ కామెంట్

sny-war-with-cpi-leader-012121

బాలీవుడ్ హాట్‌బ్యూటీ సన్నీలియోన్ రీసెంట్‌గా ఓ కండోమ్ యాడ్‌లో న‌టించి వివాదాస్ప‌దురాలైంది. దీనిపై సీపీఐ సైతం ఘాటుగా స్పందించింది. స‌న్నీ యాడ్ చూస్తే దేశంలో అత్యాచారాలు పెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌క‌ట‌నొక‌టి జారీ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్స్‌ నుంచి మద్దతు లభిస్తోంది కూడా..! సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ వ్యాఖ్య‌ల‌కు దీటుగా స‌న్ని స్పందించిన రీతికి బీ టౌన్ నుంచి కూడా మ‌ద్ద‌తు వ‌స్తోంది.
ఇంకా ఆమె ఏమంటోందంటే..?
ఇండియాలో అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీ ప్రత్యేకంగా లేదు క‌నుక చాలామందికి అస‌లు అదేంటో తెలియ‌ద‌ని ఒక్కముక్కలో తేల్చేసింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి తాను అడల్డ్ ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూర‌మ‌య్యాన‌నే విష‌యం గుర్తించాల‌ని కోరింది. గ‌తాన్ని త‌వ్వి వేటాడ‌డం స‌రైంది కాద‌ని, తాను కొత్త పంధాలో ముందుకు వెళ్తున్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోర‌ని ఆవేద‌న చెందింది. గ‌తంలో బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన సన్నీ, త‌న‌కున్న పోర్న్ స్టార్ ఇమేజ్‌ని తొలగించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అడపాదడపా యాక్షన్ మూవీస్‌లో కనిపిస్తోంది. తాజాగా సన్నీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ ట్రాక్ నడుస్తోంది. చాలామంది ఈమె గారికి మద్దతు పలుకుతున్నారు కూడా..! పొడుగు కాళ్ల సుంద‌రి శిల్పాశెట్టి సైతం ఆమెకు బాస‌ట‌గా నిల‌వ‌డం విశేషం.ఈ వివాదంపై శిల్ప మాట్లాడుతూ..
ఒకచేతికి ఉండే ఐదు వేళ్ళే ఒకలా ఉండవని, సానుకూల అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించింది. అదేవిధంగా.. సన్నీ యాడ్ పై విమర్శలు చెయ్యడం హాస్యాస్పదమని, ఆ..యాడ్ చుసిన వాళ్ళు అలా భావిస్తారని తాను అనుకోవడం లేదని, దీని గురించి ఎక్కువ స్పందించడం అనవసరమని హితవు పలికింది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌