కిడ్నిలో రాళ్లు ఎందుకు వస్తాయి?

kidney-stones

మన శరీరంలో మూత్రపిండాలు కీలకమైన విధులు నిర్వహిస్తూ ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహద పడతాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్రపిండాలు రోజుకు నీరు, రక్తంతో కలిపి 600వందల నుంచి 700 వందల లీటర్ల ద్రవాలను వడ`ోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియంలో వ్యర్థపదార్ధాలను వేరుచేసి విసర్జించేలా చేస్తాయి. మదుమేహం ఉన్న వారిలో ఈ పరిణామం మరింత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కాల్షియం, పాస్పేట్లు, ఆక్సిలేట్లు, మేగ్నిషియం, యూరియా వంటివి అవసరానికి మించి ఉంటే అవి చిన్న చిన్న స్పటికాలుగా మారుతాయి. ఇలాంటప్పుడు స్పటికాలు కలిసి రాయిగా మారే అవకాశం ఉంటుంది. కొందరిలో విటమిన్‌ ఏ, డిలు ఎక్కువగా ఉన్నా విటమిన్‌ – బి కాంప్లెక్‌‌స తక్కువగా ఉన్నా రాళ్ళు ఏర్పడుతుంటాయి. రాళ్ళు ఏర్పడటానికి యూరిక్‌ ఆసిడ్‌ ఒక బలమైన కారణంగా చెప్పవచ్చు. థైరాయిడ్‌ సమస్య కారణంగా వేసుకునే మందులు, గ్యాస్ట్రిక్‌ సమస్యల కారణంగా తీసుకునే తీసుకునే ద్రవాలు కూడా రాళ్ళు తయారు కావడానికి కారణాలుగా చెప్పవచ్చు.
దాదాపు 10శాతం రాళ్ళు దీర్ఘకాలిక సమస్యల కారణంగా ఏళ్ళ తరబడి తీసుకునే మందుల వల్లే ఏర్పడతాయి. మ`ద్యపానం చేసే వారిలోనూ ఈ సమస్య అ`దికంగా కనపడుతుంది. వీటన్నింటితో పాటు అవసరానికి సరిపడా నీటిని తీసుకోక పోవడం మరో ప్ర`దాన కారణంగా చెప్పవచ్చు. తీసుకునే ఆహారంలో కూడా రసాలు, పులుసులూ ఇవేమి లేకుండా ఘనాహారమే తీసుకునే వారిలో కూడా ఎక్కువ మంది ఈ సమస్యకు లోనవుతుంటారు. నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటు పళ్ళ రసాలు తీసుకునే వారిలో చిన్న చిన్న స్పటికాలు, వ్యర్థపదార్థాలు సులువుగా కొట్టుకుపోతాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడే సమస్య 20ఏళ్ళ వయస్సు నుంచి 60 ఏళ్ళ దాకా ఉంటుంది. 30 నుంచి 40 ఏళ్ళవయస్సు వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో ఎక్కువగా పురుషులే ఉండటం గమనార్హం.
కిడ్నీలో రాళ్ళు అంత స్వల్ప వ్యవధిలో తయారు కావు. ముందు అతి సూక్ష్మమైన స్పటికాలు తయారవుతూ ఉంటాయి. అలా కొన్నేళ్ళు గడచిన తరువాతే ఆ స్పటికాలన్నీ కలిసి ఒక రాయిగా మారతాయి. స్పటికాలుగా ఉన్నప్పుడే స్కానింగ్‌ పరీక్షలతో సమస్యను గుర్తిస్తే స్పటికాలు రాళ్ళుగా మారకుండా అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే మూత్రపిండాల్లో రాయి తయారవుతున్న సమయంలో ఎలాంటి బాధా ఉండదు. తయారైన రాయి మూత్రనాళం ద్వారా బయటికి రాబోతున్న సమయంలో మాత్రమే నొప్పి వస్తుంది. వెన్ను భాగంలో మొదలయ్యే ఈ నొప్పి మామూలుగానే కొన్ని సార్లు తీవ్రంగానూ ఉంటుంది. కొన్ని సార్లు కూర్చోవడం, పడుకోవడం కూడా దుర్భరంగా మారుతుంది. మూత్రనాళం గుండా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సన్నగా ఉన్న నాళంలో ఇరుక్కుపోవడం వల్ల బయటకు రాలేక రాపిడిలో నొప్పి వస్తుంది. కొన్ని సార్లు మూత్రపిండం నుంచి రాళ్ళు చిన్న చిన్నవిగా ఉన్నప్పుడు మూత్రాశయంలోకి చేరతాయి. అక్కడికి చేరగానే మరింత పెరుగుతాయి. అక్కడినుంచి మూత్రనాళంలోకి వెళ్ళగానే తిరిగి నొప్పి ప్రారంభమవుతుంది. ఇలాంటప్పుడు అల్ట్రాసౌండ్‌, సిటి స్కాన్‌ల ఆ`దారంగా శస్త్రచికిత్స అవసరమా లేదా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారిస్తారు. రాళ్ళు ఉన్న ప్రతీ ఒక్కరికి శస్త్రచికిత్స అవసరమా అంటే అవసరం లేదనే చెప్పవచ్చు. ఈ సమస్యను శాశ్వతంగా నివా రించేందుకు మం దులతోనే కాదు ఆహారంలో చేసే మార్పులతో పాటు నీటికి ఎక్కువగా తీసుకో వడం, పరిశుభ్ర మైన నీటిని తీసు కోవడం చాలా ముఖ్యం.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌