బండ్ల గ‌ణేశ్ కు ప‌వ‌న్ షాక్‌

4045804010

చిన్న సినిమాలే కాదు పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు సైతం తీసి నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు బండ్ల గ‌ణేశ్‌. అత‌డు నిర్మించిన గబ్బ‌ర్ సింగ్ విజ‌యవంతం కావడంతో..అల్లుఅర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’, రామ్ చరణ్ తో ‘గోవిందుడు’, ఎన్టీఆర్ తో ‘టెంపర్’ చిత్రాలను నిర్మించి మంచి లాభాలనే పొందాడు.కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ప్రస్తుతం బండ్ల గణేశ్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపడంలేదన్న‌ది ఫిలింనగర్ టాక్‌.అందుకు కారణం బండ్ల గణేశ్‌ఎప్పుడూ పవన్ నామస్మరణ చేయడమే అని తెలుస్తోంది. టెంపర్ సినిమా షూటింగ్ సమయంలో కూడా బండ్ల గణేశ్‌కు, ఎన్టీఆర్ కి మధ్య కొన్ని మనస్ప‌ర్థ‌లు వచ్చాయని దాంతో అప్పటి నుంచి ఇద్దరు ఎడమొహం పెడమోహంగానే ఉంటున్నారని సమాచారం.
మ‌హేశ్ తో కూడా కుద‌ర‌దా..!
తాజాగా..పవన్ కళ్యాణ్ కూడా బండ్ల గణేశ్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత పవన్ న‌టించే త‌దుప‌రి చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని తెగ ఉవ్విళ్లూరాడ‌ట‌!ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌వ‌న్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.ఇప్పట్లో గ‌ణేశ్‌కు అవకాశం ఇచ్చేది లేదని తన సన్నిహితులతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.‘తీన్ మార్’ ఫ్లాప్ అవడం వల్లే ‘గబ్బర్ సింగ్’ సినిమాకి అవకాశం ఇచ్చాను కానీ లేకపోతే ఇచ్చి ఉండేవాడిని కాదని పవన్ అన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.దీంతో కనీసం మహేశ్ తోనైనా సినిమా తీయాలని అనుకుంటే.. మూడేళ్ళ వరకు ఏరోస్ సంస్థ అత‌నితో ఒప్పందం చేసుకోబోతుందని తెలుసుకుని డంగైపోయాడు.అందుకే బండ్ల గణేశ్ ఈ మధ్య అక్కినేని కుటుంబంపై తెగ ప్రేమని చూపిస్తున్నాడన్న‌ది సినీ విశ్లేషకుల అభిప్రాయం.త్వ‌ర‌లో అఖిల్ తో ఓ సినిమా నిర్మించ‌బోతున్నాడ‌ని టాక్‌.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌