మొబైల్ సిమ్ కొనుగోలుపై ఆంక్షలు

మొబైల్ సిమ్ కొనుగోలుపై ఆంక్షలు

8014504052120

ఇప్పుడు సిమ్‌కార్డు కొనడం చాక్లెట్ కొన్నంత సులువు.కేవలం ఐడీ, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్‌లు, ఒక ఫొటో ఉంటే చాలు రూపాయి పెడితే సిమ్‌కార్డు ఇస్తున్నారు.పైగా కొత్త సిమ్ తీసుకుంటే బోల్డెన్ని ఆఫర్లు. ఫ్రీ టాక్‌టైమ్ అని.. 2 జీబీ మెమొరీ కార్డ్ ఫ్రీ అని ఇలా ఏవోవే చెప్పి ఊరిస్తున్నారు.ఇదే అదునుగా వినియోగ‌దారులు కూడా..టెలికామ్ కంపెనీల ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకునేందుకు ఎగ‌బ‌డుతున్నారు.కూరగాయలు అమ్మినట్లు రోడ్డు పక్కన టెంట్ వేసుకుని మరీ! సిమ్‌లు విక్రయిస్తున్నారు.అంతేకాదు స్పాట్‌లో సిమ్ యాక్టివేషన్ చేస్తున్నారు.ఇదే స‌మ‌యంలో దీనివెనుక మోసాలు కూడా గుర్తించ‌డం ఎంతో మేలు.
నువ్వేమి చేశావు నేరం
కస్టమర్లు వెళ్లిపోయిన తరువాత వారి ఫొటో, ఐడీ ప్రూఫ్‌లను కొన్ని వందలుగా జిరాక్స్ తీస్తున్నారు.ఆ తరువాత కొందరు ప్రత్యేక వ్యక్తులకు ఇలా కలెక్షన్ ప్రూఫ్‌లను ఉపయోగించి సిమ్‌లను యాక్టివేషన్ చేసి ఇస్తున్నారు.ఇందుకోసం అధిక మొత్తంలో డబ్బు తీసుకుని సిమ్‌కార్డు ఇస్తున్నా రు. ఇలా మరొకరి అడ్రస్ ప్రూఫ్‌‌తో పొందిన సిమ్‌కార్డులు ఉగ్రవాదులతో పాటు అసాంఘిక శక్తుల చేతుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అమాయకులు బలయ్యే అవకాశం ఉంది.అంటే నేరం ఒకరిది… శిక్ష మరొకరిదన్నమాట. హైదరాబాద్ బాంబు పేలళ్ల కేసులో ఉగ్రవాదులు తమ ఆచూకీ దొరక్కుండా చాలా జాగ్రత్త పడ్డారు.ఎలాంటి ప్రూఫ్‌లు ఇవ్వకుండా తమకు తెలిసిన వారి ద్వారా సిమ్‌కార్డులు తెప్పించుకున్నారు.ఇదే విష‌యం పోలీసుల విచారణలో ఇటీవ‌ల తేలింది.
జాగ్ర‌త్త‌.. జాగ్ర‌త్త‌..
ముంబై, గౌహతి వరుస బాంబు పేలుళ్లలో ముష్కరులు ఇలాంటి సిమ్‌కార్డులనే ఉపయోగించి దాడులకు పాల్పడ్డారు. హైద్రాబాద్‌లో ఇటీవల అమ్మాయిలను మోసం చేసిన మధు కూడా అక్రమ మార్గంలో 14 సిమ్‌కార్డులను సంపాదించాడు. వాటిని ఉపయోగించి వందలాది మంది మహిళలు, యువతులను మోసం చేశాడు.ఇలా చెప్పాలంటే ఎన్నో.. టెలికాం రంగంలో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వీస్ ప్రొవైడర్లు కొందరు ముందే యాక్టివేషన్ చేసిన సిమ్‌కార్డుల విక్రయానికి పంపిణీదారులను ప్రోత్సహిస్తున్నారు.యాక్టివేట్ అయిన సిమ్‌కార్డులు విద్రోహశక్తుల చేతికి చేరితే తీవ్ర పరిణామాలు చూడాల్సి రావొచ్చు.అందుకే ఇకపై సిమ్‌కార్డు కొనాలంటే ఐదు రకాల ఐడీ ప్రూఫ్‌ల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు.పాన్‌‌కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి ఉంటేనే సిమ్‌కార్డులను జారీ చేయాలని సూచించారు.డీలర్లు, రీటైల్ వ్యాపారులపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
please share it.. 

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌